భారతదేశం, జూన్ 30 -- బండి సాయి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసులో బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను నిర్దోషినని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు జులై 1 విచారణ జరపనుంది.

25 ఏళ్ల సాయి భగీరథ్.. తాను చదువుతున్న మహీంద్రా యూనివర్సిటీలో సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు పోక్సో కోర్టు నుండి వారం రోజుల పాటు తాత్కాలిక (ఇంటరిమ్) బెయిల్ పొందాడు. పరీక్షలు ముగిసిన అనంతరం నిబంధనల ప్రకారం జూన్ 25న తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారంలో అధికారుల ఎదుట హాజరయ్యాడు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు.

హైదరాబాద్ శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో 17 ఏళ్ల తన మైనర్‌ కుమార్తెపై బండి భగీరథ్ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ బాధితురాలి తల్లి మే 8వ తేదీన పేట్...