భారతదేశం, అక్టోబర్ 31 -- త్రినాధ్ కటారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మించిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఇట్లు మీ ఎదవ. వెయ్యేళ్లు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో సాహితీ అవంచ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఇటీవల రిలీజ్ చేసిన ఇట్లు మీ ఎదవ సినిమా టైటిల్ గ్లింప్స్, సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇవాళ (అక్టోబర్ 31) ఇట్లు మీ ఎదవ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ లాంచ్ చేశారు.

యూత్‌ఫుల్ ఫన్, బ్యూటిఫుల్ లవ్ స్టొరీ, ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో, డైరెక్టర్ త్రినాధ్ కటారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

హీరో, దర్శకుడు త్రినాధ్ కటారి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మీడియా వారికి పాదాభివందనం. ప్రేక...