Andhrapradesh, ఆగస్టు 8 -- నేతన్నలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.'నేతన్న భరో'సా కింద ఏడాదికి ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఇదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని చేనేత కళాకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

గురువారం గుంటూరు జిల్లా, మంగళగిరిలో నిర్వహించిన 11వ జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. చేనేతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ నెల నుంచే చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు.

"ఉచిత విద్యుత్ పథకం' ద్వారా రాష్ట్రంలో చేనేత మగ్గాలున్న 93 వేల కుటుంబాలకు, పవర్ లూమ్స్ ...