భారతదేశం, ఆగస్టు 20 -- మంగళవారం ట్రేడింగ్‌లో భారత స్టాక్ మార్కెట్ మరోసారి జోరు చూపించింది. ప్రధాన సూచీ నిఫ్టీ 50, కీలకమైన 25,000 మార్కుకు చేరువగా ముగిసింది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, స్వల్పకాలంలో నిఫ్టీ మరింత పుంజుకుని 25,300 స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. దీనికి తక్షణ మద్దతు స్థాయి (Immediate support) 24,850 వద్ద ఉందని నిపుణులు చెబుతున్నారు.

జీఎస్‌టీ రేషనలైజేషన్ (GST Rationalization)పై ఉన్న అంచనాలు, భారత్ క్రెడిట్ రేటింగ్‌ మెరుగుపడటం వంటివి మార్కెట్‌లో సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చాయి. దీంతో పాటు, రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం కూడా ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది. ఈ పరిణామాలన్నీ మార్కెట్‌కు కొత్త ఊపునిచ్చాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ (Geojit Investments Limited) రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ వెల్...