భారతదేశం, జూన్ 29 -- నవగ్రహాలలో రాకుమారుడిగా, బుద్ధి కారకుడిగా పిలిచే బుధ గ్రహం తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. నేటి నుంచే బుధుడు తిరోగమనంలోకి (వక్ర) వెళ్తున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... ఏదైనా ఒక గ్రహం వక్రమార్గంలో ప్రయాణించినప్పుడు (తిరోగమనం చెందినప్పుడు) దాని ప్రభావం అన్ని రాశులపై భిన్నంగా ఉంటుంది. ఈ మార్పు వల్ల కొన్ని రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా మారితే, మరికొన్ని రాశుల వారు కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చంద్రుడికి అధిపతి అయిన కర్కాటక రాశిలో బుధుడు తిరోగమనం చెందుతున్నాడు. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ తమ అంతర్ దృష్టిని, మనస్సాక్షిని నమ్మి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ మనస్సు ఏం చెబుతోందో గమనించి, మీ భావోద్వేగాలను, బంధుత్వాలను బ్యాలెన్స్ చేసుకోవడం ఎంతో ముఖ్యం.

సాధారణంగా ఏదైనా ఒక గ్రహం తిరోగమనం చెందినప్పుడు,...