భారతదేశం, సెప్టెంబర్ 21 -- రాష్ట్రంలో దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకు హాలీ డేస్ ప్రకటించారు. అక్టోబర్ 3 వరకు ఈ సెలవులు ఉండనున్నాయి. అంటే మొత్తం 13 రోజుల బడులు మూసి ఉంటాయి.

అక్టోబరు 4వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. అలాగే జూనియర్‌ కళాశాలలకు ఈ నెల 28 నుంచి అక్టోబరు 5 వరకు ఎనిమిది రోజుల దసరా సెలవులు ప్రకటించారు.

గతేడాదితో పోల్చితే ఈసారి దసరా ముందుగానే వచ్చింది. గతేడాదిలో దసరా పండగ అక్టోబర్ 12వ తేదీ రాగా. ఈసారి మాత్రం అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. కాబట్టి ఈసారి ముందుగానే సెలవులు ప్రారంభమయ్యాయి. ఇక అక్టోబర్ మాసంలోనే దీపావళి రానుంది. కాబట్టి అక్టోబర్ 20, 2025తేదీన హాలీ డే ఉంటుంది.

రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండగగా గుర్తించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ...