భారతదేశం, జూన్ 16 -- ఈ ఏడాది అధిక జ్యేష్ఠ మాసం వలన జ్యేష్ఠ మాసం 60 రోజులు వచ్చింది అధిక జ్యేష్ఠ మాసం నిన్న అధిక జ్యేష్ఠ అమావాస్యతో పూర్తయిపోయింది. ఈరోజు నుంచి నిజ జ్యేష్ఠ మాసం మొదలైంది. హిందూ క్యాలెండర్ ప్రకారం చూసినట్లయితే ఇది మూడవ నెల. ఉత్తరాది వారికి జ్యేష్ఠ మాసంలో కొన్ని పనులు చేయడం వలన జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ నెల రోజులు కూడా జ్యేష్ఠ మాసానికి సంబంధించిన పరిహారాలను పాటించొచ్చు. ఈరోజు జ్యేష్ఠ మాసంలో చేయాల్సిన పనులతో పాటు, జ్యేష్ఠ మాసం పేరు ఎలా వచ్చిందో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

జ్యేష్ఠ మాసాన్ని చాలా ఫలితమైనదిగా భావిస్తారు. ఈ నెలలో దానధర్మాలు చేయడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే ఈ నెలలో చేసే ఉపవాసాలు కూడా ఎన్నో శుభ ఫలితాలను తీసుకువస్తాయి.

జ్యేష్ఠ మాసంలో ఇతర నెలల కంటే పగలు ఎక్కువగా, రాత్రి తక్కువగా ఉంటుంది. ఎక్కువ పొడవు ఉన్న దా...