Andhrapradesh, సెప్టెంబర్ 24 -- తిరుమల శ్రీవారి ఆలయంలో ఇవాళ్టి నుంచి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఏర్పాట్లు చేసింది.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీవారి త‌ర‌పున సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్య‌వేక్షించారు. అనంత‌రం అంకురార్ప‌ణ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఆల‌యంలోని యాగశాలలో భూమాత‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి పుట్ట‌మన్నులో న‌వ‌ధాన్యాలను నాటారు. వైఖానస ఆగమోక్తంగా అంకురార్పణ ఘట్టం నిర్వహించారు.

వైఖానస ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురా...