భారతదేశం, ఫిబ్రవరి 16 -- రూ.300 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి, నీటి కుళాయి, భూమి పన్నులపై నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సీరియస్‌గా ఉంది. ఆర్థిక భారం పడుతుండటంతో నెల్లూరు కార్పొరేషన్ రికవరీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 46 పిటిషన్లు వచ్చాయి. దీర్ఘకాలిక డిఫాల్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ హెచ్చరించింది.

కార్పొరేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం నిర్వహించిన ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ వైఓ నందన్.. నిర్ణీత సమయంలోపు బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నెల్లూరు అంతటా సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ వ్యవస్థలు, రోడ్లు వేయడం, పెయింటింగ్ ప్రాజెక్టులతో సహా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలని పౌరులను కోరారు.

లోక్ అదాలత్ కార్యకలాపాల ద్వారా ఎగవేతదారులకు ఇప్పటికే రెండుసార్ల...