Andhrapradesh,nellore, సెప్టెంబర్ 13 -- ప్రేమోన్మాది ఘాతుకానికి ఓ విద్యార్థిని బలైపోయింది. ఈ దారుణమైన ఘటన నెల్లూరులో వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి. ప్రేమించిన యువతి(మైథిలి ప్రియ)ని నిఖిల్ అనే యువకుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. హత్య చేసిన తర్వాత మృతురాలి చెల్లెలు సాహితికి ఫోన్ చేశాడు. తమ మధ్య గొడవ జరిగిందని. అందుకే చంపేశానని చెప్పాడు. ఆ తర్వాత దర్గామిట్ట పోలీస్ స్టేషన్ లో నిందితుడు నిఖిల్ లొంగిపోయాడు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలైన మైథిలి ప్రియను మాట్లాడాలని రూమ్ కు పిలిపించిన నిఖిల్. ఈ దారుణానికి ఒడిగట్టాడు. ప్రేమను నిరాకరించడంతోనే నిందితుడు హతమార్చి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిందితున్ని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్‌ చేస్తున్నారు. నిఖిల్‌పై పోలీసులు ...