నెల్లూరులో జూన్ 26 నుంచి రొట్టెల పండుగ.. 14 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా!
భారతదేశం, జూన్ 23 -- ఏపీలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సర్వమత సామరస్య వేడుక నెల్లూరు 'రొట్టెల పండుగ-2026'కు సర్వం సిద్ధమవుతోంది. నెల్లూరు నగరంలోని బారా షాహిద్ దర్గా వేదికగా జూన్ 26 నుంచి నాలుగు రోజుల పాటు ఈ వార్షిక మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ పండుగకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతోపాటు ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 14 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ నేతృత్వంలోని ఉత్సవ కమిటీ ఈ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముఖ్యంగా పారిశుధ్యం, తాగునీరు, వసతి సౌకర్యాలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిటీ ప్రకటించింది.
భారీగా తరలివచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా పోలీస్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.