భారతదేశం, ఆగస్టు 2 -- దీర్ఘకాలిక పెట్టుబడులతో క్రమబద్ధంగా ముందడుగు వేస్తే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు ఎంతటి అద్భుతమైన రాబడులు ఇస్తాయో మరోసారి నిరూపితమైంది. గత 10 ఏళ్ల వ్యవధిలో నెలకు Rs.10,000 చొప్పున ఎస్‌ఐపీ (SIP) చేసిన ఇన్వెస్టర్లకు కొన్ని ఫండ్లు ఏకంగా Rs.38.8 లక్షల వరకు సంపదను సృష్టించి ఇచ్చాయి.

సెక్టోరల్, థీమాటిక్ ఫండ్లను మినహాయించి పరిశీలిస్తే.. కేవలం ఏడు డైవర్సిఫైడ్ ఈక్విటీ స్కీమ్‌లు మాత్రమే 20 శాతానికి మించిన వార్షిక రాబడులను అందించాయి. దశాబ్ద కాలంలో ఇవి Rs.10,000 SIP నిధిని రూ. 34.8 లక్షల నుంచి రూ. 38.8 లక్షల భారీ కార్పస్‌గా మార్చాయి. ఈ జాబితాలో పూర్తిగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్ల హవా స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఏడు పథకాలలో నాలుగు మిడ్-క్యాప్ ఫండ్లు కాగా, మిగిలిన మూడు స్మాల్-క్యాప్ ఫండ్లు. లార్జ్-క్యాప్, ఫ్లెక్సీ-క్యాప్, మల్టీ-క...