భారతదేశం, మార్చి 27 -- తెలంగాణకు సరిపడేంత యూరియా కేటాయించాలని కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది. జూలై నుంచి ఆగస్టు వరకు ఉండే గరిష్ట డిమాండ్‌కు ముందు తగినంత బఫర్ నిల్వలను నిర్మించుకోవడంలో సహాయపడాలని విజ్ఞప్తి చేసింది. రాబోయే ఖరీఫ్ సీజన్ కోసం మొదటి మూడు నెలలపాటు రాష్ట్రానికి నెలకు రెండు లక్షల టన్నుల యూరియాను కేటాయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డాను కోరారు.

రైతులు పత్తి నుంచి మొక్కజొన్న సాగుకు మళ్లుతున్నారని, అలాగే రాష్ట్రంలో బఫర్ నిల్వలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు మంత్రి తుమ్మల. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు రాష్ట్రానికి కేటాయింపులను ప్రస్తుత 10 లక్షల టన్నుల నుంచి 11.50 లక్షల టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరారు.

కేంద్ర మంత్రితో ఫోన్ సంభాషణలో కార్యకలాపాలు నిరంతరాయంగా కొనసాగేలా చూస...