భారతదేశం, ఆగస్టు 2 -- Hrithik Roshan Lease For 17 Lakh Rent: బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కేవలం వెండితెరపైనే కాక, రియల్ ఎస్టేట్ వ్యాపారంలోనూ తన సత్తా చాటుతున్నారు. సినిమాల ద్వారా వచ్చే సంపాదనను సురక్షితమైన వాణిజ్య ఆస్తుల్లో (Commercial Properties) పెట్టుబడిగా పెడుతూ స్థిరమైన అద్దె ఆదాయాన్ని గడిస్తున్నారు.

ఇందులో భాగంగానే ముంబైలోని అత్యంత ఖరీదైన అందేరీ వెస్ట్ ప్రాంతంలో ఉన్న తన ఆఫీస్ స్పేస్‌ను భారీ అద్దెకు ఇచ్చి వార్తల్లో నిలిచారు హృతిక్ రోషన్. అందేరీ వెస్ట్‌లోని న్యూ లింక్ రోడ్డులో ఉన్న 'లోటస్ నిల్ కమల్ బిజినెస్ పార్క్'లో హృతిక్ రోషన్‌కు ఏడు ఆఫీస్ యూనిట్లు ఉన్నాయి.

సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ప్రాపర్టీని 'క్లియర్‌సింత్ ల్యాబ్స్ లిమిటెడ్' అనే సంస్థకు ఐదేళ్ల కాలపరిమితికి అద్దెకు ఇచ్చారు. ప్రసిద్ధ రియల్ ఎస్టేట్ డేటా అ...