భారతదేశం, సెప్టెంబర్ 12 -- హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, హైటెక్ సిటీ లేదా బెంగళూరు, గురుగ్రామ్ వంటి ఐటీ కారిడార్లలో పని చేసే కార్పొరేట్ ఉద్యోగులు నెలకు భారీగా జీతాలు సంపాదిస్తారు. కానీ నెల చివరకు వచ్చేసరికి ఖాతాలో పైసా మిగలదు! చేతిలో ఐఫోన్లు, కాస్ట్​లీ కార్లు, వీకెండ్ పార్టీలతో ఆడంబరాలకు పోయి ఈఎంఐల ఊబిలో కూరుకుపోవడం నేటి తరంలో సాధారణమైపోయింది. అయితే పెద్ద పెద్ద ఫైనాన్స్ పుస్తకాలు చదవకుండా, ఎలాంటి మొబైల్ యాప్స్ వాడకుండానే ఒక సాదాసీదా మహిళ చూపించిన ఆర్థిక క్రమశిక్షణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పనిమనిషిగా పనిచేస్తున్న ఆమె నెలకు రూ. 60వేల వరకు సంపాదిస్తోంది!

గురుగ్రామ్‌కు చెందిన శివ మిట్టల్ అనే వ్యక్తి తన ఇంటి పనిమనిషి కథనాన్ని లింక్డ్‌ఇన్‌లో పంచుకున్నారు. ప్రతినెలా ఆమె కేవలం 3 నుంచి 4 రోజులు మాత్రమే సెలవులు తీసుకుంటూ, రోజుకు 5 నుంచ...