భారతదేశం, నవంబర్ 18 -- తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సొంత పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు అడిగినందుకు తనపై సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని తప్పుబడుతూ రాజగోపాల్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

ముఖ్యమంత్రి పదవిపై రేవంత్ రెడ్డికి అదృష్టం కలిసొచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు. "ఏదో అదృష్టం కొద్దీ సీఎం అయ్యావు. ఇంకో రెండేళ్లు ఉంటావు. కొడంగల్‌కు మాత్రమే కాదు, మునుగోడుకు కూడా నిధులు ఇవ్వమని అడిగినందుకు రేవంత్ రెడ్డి నన్ను పండబెట్టి తొక్కుతా అంటున్నాడు. నువ్వు తొక్కితే తొక్కించు...