భారతదేశం, జూన్ 15 -- Shah Rukh Khan Warns Singer Mika Singh About Gauri Khan: భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మికా సింగ్ సంచలన విషయాలను పంచుకున్నారు. నేడు దేశవ్యాప్తంగా దాదాపు 99 స్థిరాస్తులు (Properties) కలిగి ఉన్న ఈ స్టార్ సింగర్.. ముంబై నగరంలో అత్యంత ఖరీదైన అంధేరి వెస్ట్ ప్రాంతంలో ఏకంగా రూ. 50 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను సొంతం చేసుకున్నారు.

అయితే, ఇంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని సృష్టించడం తన ఆశయం కాదని, కేవలం ఒక మంచి గాయకుడిగా స్థిరపడాలనేదే తన ఏకైక కల అని సింగర్ మికా సింగ్ పేర్కొన్నారు.

చిన్నతనంలోనే సంగీతం వైపు అడుగులు వేసిన మికా సింగ్.. కేవలం 13 ఏళ్ల వయసులో జగరణ్ (భక్తి సంగీత కార్యక్రమాలు) లలో పాటలు పాడేవారు. ఆ సమయంలో ఆయన అందుకున్న మొదటి పారితోషికం అక్షరాలా 75 రూపాయల...