భారతదేశం, మే 16 -- శని కర్మఫల ప్రధాత. క్రమశిక్షణకు మారుపేరు శని దేవుడు. శని దేవుడి పుట్టుక నుంచి ఆయన చూపు దాకా ఎన్నో భయంకరమైన మిస్టరీలు ఉన్నాయి. చాలా మందికి వీటి గురించి తెలియదు. మరి ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శనికి తండ్రి సూర్యుడు అయినా, శనిదేవుడికి తండ్రితో ఏ మాత్రం పడేది కాదు. శని దేవుడు జన్మించినప్పుడు ఛాయా రంగులో ఉండడాన్ని చూసి సూర్యదేవుడు కుమారుడిగా అంగీకరించలేదు. నిరాకరించాడు. తల్లిని సూర్యుడు అవమానించాడని శని దేవుడికి కోపం వచ్చింది. ఆ తర్వాత ఆ కోపంతోనే శివుడి కోసం తపస్సు చేసి గ్రహాల న్యాయాధికారి పదవిని శనిదేవుడు పొందాడు. అందుకే సూర్య, శని గ్రహాలు కలిసినట్లైతే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు.

శనిదేవుడి చూపు ఎవరి మీద అయితే పడుతుందో వారికి కష్టాలు మొదలవుతాయని అందరికీ తెలిసినదే. అయితే ఆయన చూపు ఎంద...