నీట్ లీక్ కేసులో సీబీఐ చార్జ్‌షీట్: ఎన్టీఏ అధికారులకు ప్రమేయం లేదు
భారతదేశం, జూలై 29 -- నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సంచలన విషయాలను వెల్లడించింది. ఈ కుట్రతో ఎన్టీఏ (NTA) అధికారులకు కానీ, ప్రభుత్వ సిబ్బందికి కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో మంగళవారం చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అరెస్ట్ చేసిన 13 మంది నిందితులపై నేరపూరిత కుట్ర, మోసం, విశ్వాసఘాతుకం, సాక్ష్యాల విధ్వంసంతో పాటు అవినీతి నిరోధక చట్టం, ప్రజా పరీక్షల (అక్రమాల నిరోధక) చట్టం 2024 కింద కేసులు నమోదు చేసింది.
పరీక్షా పత్రాలను తయారు చేసేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమితులైన ప్రైవేట్ ఉపాధ్యాయులే ఈ లీకేజీకి అసలు కారణమని సీబీఐ తన విచారణలో తేల్చింది. కెమిస్ట్రీ ప్రొఫెసర్ పి.వి. కులకర్ణి, బయాలజీ నిపుణురాలు మనీషా మంధారే, ఫిజిక్స్ నిపుణురాలు మనీషా హవల్దార్‌లను ప్రధాన నిందితులు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.