భారతదేశం, జూన్ 21 -- దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నీట్ (NEET) పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల సమయంలో ప్రయాణికుల నుంచి వచ్చే విపరీతమైన రద్దీని తట్టుకునేందుకు వీలుగా హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలును నడుపుతోంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.

రైల్వే శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. చర్లపల్లి - తిరుపతి(రైలు నంబర్ 07052) ప్రత్యేక రైలు ఆదివారం(ఇవాళ) రాత్రి 8:25 గంటలకు చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు (సోమవారం) మధ్యాహ్నం 1:15 గంటలకు తిరుపతి స్టేషన్‌కు చేరుకుంటుంది. సుదూర ప్రాంతాల నుంచి పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఆర్థిక భారం కాకుండా ఉండేందుకు వీలుగా ఈ రైలులో కేవలం జనరల్...