భారతదేశం, ఏప్రిల్ 22 -- కృష్ణా నదీ జలాల పంపిణీ, వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదాల నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నీటి నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూసేందుకు కృష్ణా నదీ మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ) కొన్ని ఆదేశాలు జారీ చేసింది. శ్రీశైలం డ్యామ్‌లో జరిగిన ఉన్నత స్థాయి తనిఖీ సందర్భంగా, బోర్డు ఛైర్మన్ ఎస్. బిశ్వత్, సీనియర్ అధికారులతో కలిసి, రెండు రాష్ట్రాలు స్వతంత్ర టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఈ వ్యవస్థలు నీటి తోడటం, వినియోగాన్ని రియల్ టైమ్‌లో పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తాయి. తద్వారా రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు ఆస్కారం తగ్గుతుంది. క్రియాశీలకమైన, ఏకీకృత పర్యవేక్షణ యంత్రాంగం లేకపోవడమే పదేపదే వివాదాలు తలెత్తడానికి ప్రధాన కారణాలలో ఒకటని బోర్డు అధికారులు ...