భారతదేశం, మే 19 -- తెలంగాణలోని నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెద్ద ఊరటనిచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూ, వయోపరిమితి దాటిపోతుందనే ఆందోళనలో ఉన్న అభ్యర్థులకు మేలు జరిగేలా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో గరిష్ఠ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ గతంలో ఇచ్చిన సడలింపును, తాజాగా మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్ల జారీలో జరిగిన ఆలస్యం, కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయిన సమయాన్ని పరిగణనలోకి తీసుకుని గతంలోనే ప్రభుత్వం గరిష్ఠ వయోపరిమితిని 10 ఏళ్లకు పెంచింది. అంటే అప్పటివరకు ఉన్న 34 ఏళ్ల పరిమితిని 44 ఏళ్లకు పెంచుతూ జీవో ఇచ్చింది.

ఆ ఉత్తర్వుల గడువు ముగియడంతో, ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న ల...