భారతదేశం, ఏప్రిల్ 15 -- నియోజకవర్గాల పునర్విభజన గురించి దేశం మెుత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 60 కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణలో అదనంగా చేరతాయని అంచనా. తద్వారా మొత్తం నియోజకవర్గాల సంఖ్య 119 నుండి సుమారు 179కి పెంచే అవకాశం ఉంది.

రాష్ట్రంలో లోక్‌సభ స్థానాల సంఖ్యలో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించవచ్చినప్పటికీ.. అసెంబ్లీ స్థానాల కేటాయింపులో మాత్రం గణనీయమైన పెరుగుదల ఉండనుంది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల ఉమ్మడి అసెంబ్లీ స్థానాల సంఖ్య 29 నుండి 45కి పెరుగుతుంది. ఇందులో హైదరాబాద్‌కు 20 స్థానాలు, మేడ్చల్-మల్కాజిగిరికి 13, రంగారెడ్డికి 12 స్థానాలు దక్కుతాయి. నల్గొండ, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఒక్కో జిల్లాకు ఎనిమిది స్థానాల చొప్పున వచ్చే అవకాశం ఉంది.

జనాభా ఒక్కటే నియోజకవర్గాల పునర్విభజనక...