భారతదేశం, అక్టోబర్ 13 -- నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఒక ప్రకటన జారీ చేసింది. నిమ్స్‌ను సందర్శించే రోగులు, సహాయకులు, సందర్శకులు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని తెలిపింది. అత్యవసరం అయితే తప్ప ప్రైవేట్ వాహనాలను తీసుకురావద్దని కోరింది.

రాబోయే మూడు నెలల పాటు ఆసుపత్రి ప్రాంగణంలో జీహెచ్‌ఎంసీ దశలవారీగా సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్న నేపథ్యంలో ఈ మేరకు నిమ్స్ అధికారులు ప్రకటన జారీ చేశారు. సీసీ రోడ్ల నిర్మాణ పనుల కారణంగా.. ఈ మూడు నెలల నిర్మాణ కాలమంతా ఆసుపత్రి ప్రాంగణంలో పార్కింగ్ లభ్యత తీవ్రంగా పరిమితంగా ఉంటుందని నిమ్స్(NIMS) తెలిపింది.

ఈ మౌలిక సదుపాయాల పనుల్లో భాగంగా క్యాంపస్‌లోని పలు కీలక ప్రాంతాలలో పనులు చేపట్టనున్నారు. వీటిలో పుంజాగుట్ట ఎంట్రీ, ఎగ్జిట్ ద్వారాలు, మిలీనియం, ఫిజియోథెరపీ బ్లాక్, డయాలసిస్ వెయిటింగ్ ఏరియా, వెల్...