భారతదేశం, జనవరి 1 -- కలలు కనడం కష్టం కాదు.. కానీ ఆ కలలను నిజం చేసుకునేందుకు పడే తపన, చేసే పోరాటం అసాధారణం. సరిగ్గా ఏడేళ్ల క్రితం కాన్పూర్ వీధుల్లో టెంపో నడిపిన ఒక యువకుడు, ఇప్పుడు ఆకాశంలో విమానాలను నడిపించే స్థాయికి ఎదిగారు. ఆధునిక భారతీయ పారిశ్రామిక రంగంలో శ్రవణ్ కుమార్ విశ్వకర్మ సాగించిన ఈ ప్రయాణం ఒక అద్భుతమైన స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో శ్రవణ్ కుమార్ జన్మించారు. చిన్నతనంలో చదువుపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఏడేళ్ల క్రితం వరకు ఆయన బతుకు దెరువు కోసం లోడర్‌గా, టెంపో డ్రైవర్‌గా పనిచేశారు. "నేను టెంపోల్లో ప్రయాణించడమే కాదు, వాటిని స్వయంగా నడిపాను. కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తికి సైకిల్, బస్సు, రైలు, టెంపో.. ఇలా ప్రతి ప్రయాణం గురించి పూర్తి అవగాహన ఉంటుంది" అని శ్రవణ్ కుమార్ తన గతా...