భారతదేశం, ఫిబ్రవరి 13 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో క్రాంతి ఫొటో చూపిస్తూ విరాట్, చంద్రకళ వెతుకుంటారు. ఇంతలో ఓ బిల్డింగ్‌పైకి క్రాంతి వెళ్లడం విరాట్ చూస్తాడు. క్రాంతి సూసైడ్ చేసుకోవాలని చూస్తుంటే వెనక్కి పట్టి క్రాంతిని లాగుతాడు విరాట్. లాగి చెంపపై ఒక్కటి కొడతాడు విరాట్.

అన్ని రకాలుగా ఫూల్ అయ్యాను, కొడుకుగా ఫెయిల్ అయ్యాను అని బాధపడుతాడు క్రాంతి. శాలినికి అవకాశం ఇచ్చింది నేనే కదా అని పశ్చాత్తాపపడతాడు. నువ్వు ఇలా ఆలోచిస్తావనే ఇన్నాళ్లు నీకు శాలినీ గురించి చెప్పలేదు. మెల్లిగా మెల్లిగా తెలిసేలా చేద్దామనుకున్నాం. కానీ, ఒకేసారి ఎక్కువగా తెలిసిందని విరాట్ అంటాడు.

సరే ఇంటికి వెళ్దామని చంద్రకళ అంటే.. ఏ మొహం పెట్టుకుని రావాలని క్రాంతి అంటాడు. అయితే అంతా కలిసి కట్టకట్టుకుని దూకేద్దాం. నిన్ను వదిలేసి వెళ్తే ఇంట్లో వాళ్ల మొహం చూడలేం. మేము ...