భారతదేశం, నవంబర్ 15 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజ్‌తో శ్రుతి మాట్లాడటం, హగ్ చేసుకోవడం రఘురాం చూస్తాడు. రాజ్ వెళ్లిపోతాడు. శ్రుతి అని గట్టిగా అరిచిన రఘురాం బావ అంటే ప్రాణం అని చెప్పి బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతావా. ఇంట్లోకి రా నీ సంగతి చెబుతాను అని అంటాడు. భయంతో శ్రుతి వస్తుంది.

మొత్తం చూసేశాను అంటూ కామాక్షి, శ్యామలను తోసేసి మరి శ్రుతి దగ్గరికి కోపంగా వెళ్తాడు రఘురాం. నేలపై ఫ్లవర్ వాజ్ కిందపడిన సౌండ్ విని ఆగిపోతాడు. ఏం చూశారు అని వచ్చి జగదీశ్వరి అడుగుతుంది. మర్చిపోయాను అని రఘురాం అంటాడు. అన్నయ్య శ్రుతి వైపు పరిగెత్తాడు. ఏమైనా చెప్పాలనుకున్నాడా అని శ్యామల అంటుంది.

శ్రుతి నువ్వు బైక్‌పై వచ్చావుగా. అతనెవరు అని రఘరాం అంటాడు. బుక్ చేసుకున్నాను. అతను డ్రైవర్ అని శ్రుతి కవర్ చేస్తుంది. మరోవైపు విరాట్, క్రాంతిని ఎలా విడగొట్టాల అని ఆలోచ...