భారతదేశం, డిసెంబర్ 11 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతికి జాలి రాజ్ కాల్ చేస్తాడు. ఎక్కడ కలుద్దామని శ్రుతి అంటే.. పెళ్లి గురించి అడుగుతాడు రాజ్. ఏంటీ బేబీ చిరాకు పడుతున్నావ్ అని శ్రుతి మాట్లాడుతుంది. ఇంతలో చంద్రకళ వచ్చి ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. నా బాయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడుతున్నానని శ్రుతి అంటే చంద్రకళ తెగ నవ్వుతుంది.

నిన్ను ప్రేమించాడంటే వాడు కచ్చితంగా తలకు మాసినోడే అయింటాడు అని చంద్రకళ అంటుంది. ఇంతలో శాలిని వస్తుంది. నీ ప్రవర్తనలో తేడా వస్తుందని, ఏంటీ విషయం. ఏ తలకు మాసినవాడిని ప్రేమించావా ఏంటీ అని శాలిని అంటుంది. అది విన్న రాజ్ తల బాదుకుని కాల్ కట్ చేస్తాడు. నీకన్నా చంద్రనే నయం లైఫ్ పార్టనర్‌ను వెతుక్కునేందుకు సలహా ఇచ్చిందని శ్రుతి చెబుతుంది.

ఇదేదే మనకు వర్కౌట్ అయ్యేలా ఉందని శాలిని అనుకుంటుంది. నువ్ ఎంత ట్రై ...