భారతదేశం, అక్టోబర్ 31 -- నిన్ను కోరి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో హోమం నుంచి తీసిన భస్మాన్ని మావయ్యకు పెట్టమని చంద్రకళ ఇస్తుంది. ఏం కోరుకున్నావో అని, వద్దని శ్యామల అంటుంది. ఎందుకు చంద్రను నెగెటివ్‌లా చూస్తావని విరాట్ అంటాడు. అలా చూడకుండా ఉండాలంటే తప్పు చేయేలదేని నిరూపించు అని శ్యామల అంటుంది.

పూజ ఫలితం దక్కాలంటే మావయ్యకు రోజు బొట్టు పెట్టాలని చంద్రకళ అంటుంది. మరోవైపు క్రాంతి కోపంగా వస్తాడు. వచ్చి ఫ్లవర్ వాజ్ విసిరేస్తాడు. అంత కోపంగా ఎందుకున్నావురా అని క్రాంతిని అడుగుతుంది శ్యామల. మా ఆయన ఏం చేశారు అని చంద్రకళ అంటుంది. హాస్పిటల్‌లో ఏం చేశాడో కనుక్కో. అయినా మీరిద్దరు తోడు దొంగలే కదా. నీకు తెలిసే ఉంటుంది అని క్రాంతి అంటాడు.

నేను చేసింది తప్పే కాదు అని విరాట్ అంటాడు. శాలిని డ్రామా చేస్తుంది. ఇది నా భార్య గొప్పతనం. నువ్వు హిప్నటైజ్ చేయించినా తను మ...