భారతదేశం, ఫిబ్రవరి 6 -- నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ. 600 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల (ప్రతి పాఠశాలకు రూ. 200 కోట్ల చొప్పున) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. "ప్రజాపాలన - ప్రగతిబాట" కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు.

రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో ప్రజలందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ వేదికగా ఇందూరు జిల్లా మహిళా సమాఖ్య (1614 స్వయం సహాయక సంఘాలు) కు రూ. 200 కోట్ల బ్యాంకు లింకేజీకి సంబంధించిన చెక్కును అందించారు.

"నిజామాబాద్...