భారతదేశం, డిసెంబర్ 26 -- క్రిస్మస్ వేళ కానుకలు ఇవ్వడం సహజం. కానీ, ఒక కంపెనీ యజమాని తన ఉద్యోగులకు ఇచ్చిన కానుక వింటే మీరు ముక్కున వేలేసుకుంటారు. అమెరికాలోని 'ఫైబర్‌బాండ్' (Fibrebond) కంపెనీ మాజీ సీఈఓ గ్రాహం వాకర్, తన సంస్థను విక్రయించిన తర్వాత వచ్చిన లాభాల్లో సింహభాగాన్ని తన సిబ్బందికే పంచిపెట్టి 'నిజమైన శాంటా క్లాజ్' అనిపించుకున్నారు.

వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, గ్రాహం వాకర్ తన కంపెనీని 'ఈటన్' (Eaton) అనే సంస్థకు 1.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 14,300 కోట్లు) విక్రయించారు. అయితే, ఈ డీల్ కుదుర్చుకునే సమయంలోనే ఆయన ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టారు. అమ్మకం ద్వారా వచ్చే సొమ్ములో 15 శాతాన్ని తన ఉద్యోగులకు బోనస్‌గా ఇవ్వాలని స్పష్టం చేశారు.

దీని ప్రకారం, మొత్తం 240 మిలియన్ డాలర్లను (సుమారు రూ. 2,000 కోట్లు) 540 మంది పూర్తిస్థాయి ఉద్యోగుల...