Hyderabad,telangana, ఆగస్టు 6 -- జంట జలశయాలైన హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరింది. గత కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో. రెండు రిజర్వాయర్లలో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది.

హిమాయత్ సాగర్ నిండుకుండలా మారటంతో గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మూస పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో రెండు జలాశయాలు నిండుగా మారాయి. దీంతో జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తున్నారు. వ‌ర‌ద నీటి ఇన్ ఫ్లో వివ‌రాల‌పై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జ‌లాశయాల గేట్ల నిర్వ‌హ‌ణ‌లో రాజీ ప‌డ‌కూడ‌ద‌ని సిబ్బందికి ఆదేశాలను జారీ చేశారు. ప్ర‌తినిత్యం సీసీ కెమెరాల‌తో ప‌ర్య‌వేక్షించటంతో ...