భారతదేశం, జూలై 7 -- తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ఘటనకు సంబంధించి ఆడియో వైరల్ అయింది. నిజామాబాద్ జిల్లా న్యాల్కల్‌లో భర్త దాయిని ప్రశాంత్(35)‌కు భార్య సంధ్య హార్పిక్ ఎక్కించి చంపిన విషయం తెలిసిందే. భర్తకు మద్యం తాగించిన వెంకటసాయి అలియాస్ బంటితో సంధ్య మాట్లాడిన కాల్ రికార్డ్ బయటకొచ్చింది. ఇందులో తన భర్త అస్సలు లేవకుండా తాగించాలని పదే పదే చెబుతోంది సంధ్య.

భర్త ప్రశాంత్, వెంకటసాయి పక్క పక్కన ఉండగానే సంధ్య కాల్ చేసింది. వెంకటసాయితో మాట్లాడుతూ.. నువ్ ఏం చేస్తావో తెలియదు. నా భర్తకు అతిగా మద్యం తాగించు అని చెప్పడం ఆడియోలో ఉంది. ఏం చేస్తావో తెలియదు.. నా భర్త మెుత్తం మందు తాగేసి పైననే పడుకోవాలి. అస్సలు కిందకు రావొద్దు.. కొంచెం ఉండగానే ఇంకా మందు తెప్పించు. మెుత్తం తాగించు అంటూ వెంకటసాయికి చెప్పింది సంధ్య. నీకు వచ్చిన సమస్యకు నాకేందుకు బాధ అ...