భారతదేశం, డిసెంబర్ 30 -- కలర్ ఫొటో, బెదురులంక 2012 సినిమాల బ్యానర్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ దండోరా. బిగ్ బాస్ శివాజీ, నవదీప్, బిందు మాధవి, నందు, రవికృష్ణ నటనతో మెప్పించిన దండోరా మూవీకి మురళీకాంత్ దర్శకత్వం వహించారు.

అయితే, డిసెంబర్ 25న థియేటర్లలో విడుదలైన దండోరా మంచి హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. రూరల్ నెటివిటీతో సామాజిక అసమానతలపై ఆకట్టుకునే విధంగా దండోరా మలిచారంటూ ప్రశంసలు వస్తున్నాయి. అయితే, సినిమా రిలీజ్‌కు ముందు నిర్వహించిన దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ మురళీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దర్శకుడు మురళీకాంత్ మాట్లాడుతూ .. "మంచి సినిమాల్ని తీస్తే థియేటర్లకు జనాలు వస్తారని నిరూపిస్తున్న అనిల్ రావిపూడి గారికి థాంక్స్. ఈ రోజు ఆయన మా ఈవెంట్‌కు రావడం ఆనందంగా ఉంది. నేను ఇక్కడకు సినిమా తీయాలని వచ్చాను. మూవీ తీశాను. నా దృష...