భారతదేశం, మే 20 -- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "భారతీయ జనతా పార్టీ (BJP) లో ప్రతి ఒక్కరూ సుశిక్షితులైన సిపాయిలే. క్రమశిక్షణ, దేశభక్తి, కమిట్‌మెంట్‌తో పనిచేసే కరడుగట్టిన బీజేపీ కార్యకర్తను చివరి కోరిక ఏంటని అడిగితే.. తాను చనిపోయిన తర్వాత తన పార్థివదేహంపై బీజేపీ జెండా కప్పాలని కోరుకుంటాడు." అంటూ భావోద్వేగంగా మాట్లాడారు.

ఇటీవల తన కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు, తదనంతర రాజకీయ పరిణామాలపై సంజయ్ సూటిగా స్పందించారు. తనను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలకు ఆయన ఘాటుగా సమాధానమిచ్చారు.

"కన్నకొడుకును విచారణ కోసం పోలీసులకు స్వయంగా అప్పగించిన తండ్రి ఎవరైనా ఉన్నారా? చట్టంపై గౌరవంతో, విచారణకు సహకరించాలనే ఉద్దేశంతోనే నా కుమారుడిని పోలీసులకు అప్...