భారతదేశం, నవంబర్ 6 -- హీరోగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు రాకింగ్ స్టార్ మంచు మనోజ్. ఇటీవల మిరాయ్ సినిమాలో విలన్‌గా యాక్ట్ చేసి మెప్పించాడు. హీరోగా, విలన్‌గా మెప్పిస్తున్న మంచు మనోజ్ రీసెంట్‌గా ఓ సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు సతీమణి భూమా మౌనికతో కలిసి జంటగా హాజరయ్యాడు.

ఆ పాటే రాంబాయి నీ మీద నాకు. అఖిల్, తేజస్విని జంటగా నటించిన లేటెస్ట్ రూరల్ బ్యాక్‌డ్రాప్ లవ్ స్టోరీ సినిమా రాజు వెడ్స్ రాంబాయి. ఈటీవీ విన్ ఓటీటీ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్న ఈ సినిమాకు సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు.

నవంబర్ 21న రాజు వెడ్స్ రాంబాయి సినిమా థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రాంబాయి నీ మీద నాకు లిరికల్ సాంగ్‌ను మంచు మనోజ్, భూమా మౌనిక చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో మంచు మనోజ్ ఆసక్తికర క...