భారతదేశం, అక్టోబర్ 21 -- ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారంటూ వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ చేపట్టింది. జస్టిస్ జాయ్‌మల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలను బుధవారం వినింది. ఈ సందర్భంగా ఎన్నికల ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు నామినేషన్లు వేయని చోట 48 గంటల సమయం పెంచాలని ఆదేశించింది. శాంతిభద్రతల విషయంలో డీజీపీ అన్ని రకాల చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

వైసీపీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అమర్‌దీప్ సింఘ్.. ధర్మాసనం ఎదుట సుదీర్ఘ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 600 పురపాలక వార్డుల్లో 19 మున్సిపాలిటీలలో ఏకంగా 63 శాతం మేర వైసీపీ అభ్యర్థులను దౌర్జన్యంగా నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తీ...