భారతదేశం, సెప్టెంబర్ 13 -- టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస హిట్లతో అదరగొట్టాడు మంచు మనోజ్. కానీ ఫ్యామిలీలో ప్రాబ్లెమ్స్ తో సినిమాలకు దూరమయ్యారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ గానూ స్ట్రగుల్ పడ్డారు. ఇప్పుడు ఆయన మిరాయ్ సినిమాతో అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇందులో విలన్ గా వేరే స్థాయిలో యాక్టింగ్ కనబరిచారు. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వస్తోంది. మూవీ సక్సెస్ ఈవెంట్ ను శనివారం (సెప్టెంబర్ 13) హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ మనోజ్ ఎమోషనల్ అయ్యాడు.

శనివారం హైదరాబాద్ లో 'మిరాయ్' సక్సెస్ ఈవెంట్ లో మంచు మనోజ్ భావోద్వేగానికి గురయ్యాడు. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని, నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ ల గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో తనను చేర్చుకోవద్దని చాలా మంది చెప్పి ఉంటారని సంచలన వ్యాఖ్యలు చేశాడు.

"నేను చివరిసారిగా ఇలా సక్సెస్ మీట్ వేదికపై కనిపించి 1...