భారతదేశం, ఫిబ్రవరి 14 -- కోలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ హీరో ధనుష్ తాజాగా ఒక భారీ వివాదంలో చిక్కుకున్నాడు. సినిమా షూటింగ్ ఆలస్యం కారణంగా తలెత్తిన ఆర్థిక నష్టాలకు బాధ్యత వహిస్తూ పరిహారం చెల్లించాలంటూ తేనాండల్ ఫిల్మ్స్ అనే నిర్మాణ సంస్థ అతనికి లీగల్ నోటీసులు జారీ చేసినట్లు 'వన్ ఇండియా తమిళ్' రిపోర్టు వెల్లడించింది.

నిర్మాణ సంస్థ తరఫున న్యాయవాది ఎ. చిదంబరం జారీ చేసిన నోటీసుల ప్రకారం.. 2016లో ధనుష్ 'నాన్ రుద్రన్' (Naan Rudran) అనే సినిమా కోసం తేనాండల్ ఫిల్మ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ సినిమాకు ధనుష్ హీరోగా నటించడమే కాకుండా, దర్శకత్వం కూడా వహించాల్సి ఉంది.

అయితే ప్రాజెక్ట్ మొదలై చాలా ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేర్పులకు నిర్మాణ సంస్థ అంగీకరించినప్పటికీ, ...