భారతదేశం, నవంబర్ 12 -- ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న పక్కా సమాచారంతో నాగర్‌కర్నూల్ జిల్లా నీటిపారుదల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(DEE) సత్యనారాయణకు అవినీతి నిరోధక శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ఆయనపై కేసు నమోదు చేసిన ఏసీబీ బృందాలు.. నాగర్‌కర్నూల్, హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్, నాగోల్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో విస్తృత తనిఖీలు చేపట్టాయి.

ఈ సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో స్థిర, చరాస్తులు బయటపడ్డాయి. ప్రభుత్వ రికార్డుల విలువ ప్రకారం సత్యనారాయణ ఆస్తుల విలువ రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల మధ్య ఉండగా, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ ఏకంగా రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

సోదాల అనంతరం డీఈఈ సత్యనారాయణను అరెస్ట్ చేసి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆయనకు రిమాండ్ విధి...