భారతదేశం, నవంబర్ 1 -- తెలుగులో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న సరికొత్త సినిమా ఇట్లు మీ ఎదవ. వెయ్యేళ్లు వర్ధిళ్లు అనేది సినిమా ట్యాగ్‌లైన్. త్రినాధ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వం వహించారు. సాహితీ అవంచ హీరోయిన్‌గా చేసిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్ రిలీజ్ నిన్న (అక్టోబర్ 31) జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఇట్లు మీ ఎదవ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సంగీత దర్శకుడు ఆర్‌పీ పట్నాయక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఆర్‌పీ పట్నాయక్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా కథ విన్నాను. నాకు బాపు గారి సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ సినిమా చేస్తే ఆ కోరిక తీరుతుందని ఫీలింగ్ వచ్చింది. త్రినాధ్ డెడికేటెడ్‌గా ప్యాషనేటెడ్‌గా ఈ సినిమాకి పనిచేశారు. ఈ సినిమాకి టైటిల్ సూచించింది కూడా నేనే" అని అన్నారు.

"కథ విన్నప్పుడే హిట్ వైబ్ వచ్చింది. ఈ ...