భారతదేశం, అక్టోబర్ 12 -- నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీ దేవిని పూజించాలి. గాయత్రీ అమ్మవారిని ఆరాధించడం వలన అమ్మవారి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు. దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రూపాల్లో అమ్మవారిని పూజించి, రకరకాల నైవేద్యాలను సమర్పిస్తారు. గాయత్రీ దేవిని ఈరోజు ఆరాధించేటప్పుడు చదువుకోవాల్సిన మంత్రాలు, పూజా విధానం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గాయత్రీ దేవి పూజ చేయడం వలన మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. గాయత్రీ దేవి జ్ఞానం, పవిత్రత, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీక. గాయత్రీ దేవిని ఆరాధిస్తే ఆలోచనల్లో స్పష్టత కలుగుతుంది. నవరాత్రుల్లో గాయత్రీ దేవిని ఎలా పూజించాలి? ఏ మంత్రాన్ని జపించాలి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గాయత్రీ దేవిని వేదమాతగా ఆరాధిస్తారు. గాయత్రీ మంత్రం శక్తివంతమైన మంత్రాల్లో ఒకటి. ఈ మంత్రం సూర్...