భారతదేశం, ఫిబ్రవరి 23 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో శుభ యోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని రాశుల వారు సమస్యలను ఎదుర్కొంటే, కొన్ని రాశుల వారు లాభాలనే పొందుతారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 22న కుజుడు, గురువు 120 డిగ్రీల వద్ద ఉండడంతో నవ పంచమ రాజయోగం ఏర్పడబోతోంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టంగా మారబోతోంది. ఈ రెండు గ్రహాల కారణంగా ఏర్పడే ఈ నవ పంచమ రాజయోగం ఏ రాశుల వారికి ఎలాంటి లాభాలను తీసుకొస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

త్వరలో నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. విపరీతమైన అదృష్టాన్ని అందించబోతోంది. గ్రహాలు వాటి రాశులను మార్చినప్పుడు కొన్నిసార్లు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్చి 22న కుజుడు, గురువు నవ పంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇది కొన...