భారతదేశం, నవంబర్ 25 -- బంగాళాఖాతంలో ఏర్పడిన రెండు ఉపరితల ఆవర్తనాల కారణంగా ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం, రాయలసీమ ప్రాంతాలలో నవంబర్ 29 నుండి డిసెంబర్ 2 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మలక్కా జలసంధి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంపై అల్పపీడన ప్రాంతం బలపడే సంకేతాలను చూపిస్తోందని, మంగళవారం దక్షిణ అండమాన్ సముద్రంపై వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

నవంబర్ 26 నాటికి సెన్యార్ తుపానుగా మారే మారవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మంగళవారం నాటికి కొమోరిన్, దాని పరిసర ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాలలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మరింతగా మారే అవకాశం ఉంది. కొన్ని రోజుల కిందట ఏపీ తీరప్రాంతాలను మెుంథా తుపాను ఘోరంగా ప్రభావితం చేసింది. ఇప్పుడు సెన్యార్ తుపాను ఎటువైపు దూసుకొస్తుందో అనే ఆందోళన నెల...