భారతదేశం, నవంబర్ 12 -- హిందూ సంప్రదాయంలో గురువారం అనగానే జగత్కారకుడు శ్రీ మహావిಷ್ಣవువు పూజకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున భక్తిశ్రద్ధలతో శ్రీహరిని ఆరాధించడం వల్ల జాతకంలో గురు బలం బలపడి, బృహస్పతి అపార కరుణ లభిస్తుందని నమ్ముతారు.

నవంబర్ 12 గురువారం నాడు గ్రహాల గమనాన్ని బట్టి అన్ని రాశుల వారికి ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ పరమైన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం.

ఈరోజు మీకు వృత్తిపరంగా ఎంతో అద్భుతంగా గడుస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి నూతన బాధ్యతలు దక్కడంతో పాటు మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయాన్ని గడుపుతారు.

మీరు పడిన శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. ఆఫీసులో మీ పనితీరును చూసి పైఅధికారులు ప్రత్యేకంగ...