నల్గొండలో ఆ నలుగురిది సూసైడ్ కాదు.. దారుణంగా చంపేసిన సుపారీ గ్యాంగ్!
భారతదేశం, జూన్ 25 -- నల్గొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో శవమై తేలిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. జూన్ 22న వెలుగుచూసిన ఈ దారుణాన్ని తొలుత అందరూ ఆత్మహత్యగానే భావించారు. అయితే రంగంలోకి దిగిన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించగా.. ఇది ఆత్మహత్య కాదు, అత్యంత క్రూరంగా జరిగిన హత్యలు అని తేలింది.
మృతులను ప్రకాశంబజార్‌లో బ్యాగుల వ్యాపారం చేసే మహ్మద్ సుల్తాన్ (45), ఆయన భార్య హసీనా (38), కుమారుడు ముజామిల్ (20), కుమార్తె అఫోర (14)గా గుర్తించారు. ఘటనా స్థలంలో నిందితులు ఎలాంటి ఆధారాలు వదలకుండా జాగ్రత్త పడినప్పటికీ, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక పోలీసులకు కీలక ఆధారాలను అందించింది. పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి, ప్రణాళికాబద్ధంగా వీరిని హతమార్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టమైంది....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.