భారతదేశం, ఆగస్టు 17 -- ప్రముఖ టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. హిందూ మతం, సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ నాయకులు ఆమెపై హైదరాబాద్‌లోని బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బీజేపీ నాయకులు తమ ఫిర్యాదులో అనసూయ చేసిన వ్యాఖ్యలు కోట్లాదిమంది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని పేర్కొన్నారు. జై శ్రీరామ్ నినాదం ముసుగులో కొందరు అసాంఘిక దాడులకు పాల్పడుతున్నారంటూ అనసూయ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాషాయ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడకూడదని, మాట్లాడేటప్పుడు చూసుకోవాలని హెచ్చరించారు. మతపరమైన భావాలను గాయపరిచినందున ఆమెపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.

పోలీస్ స్టేషన్‌లో కేసు నమో...