భారతదేశం, మార్చి 24 -- ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మిగిలిపోయిన పెళ్లి భోజనం తినడంతో 10 మంది చిన్నారులతో సహా 60 మందికి పైగా ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారు. నంద్యాలలోని వైఎస్ఆర్ నగర్‌లోని బుడగ జంగల కాలనీలో కొందరు వచ్చి.. మిగిలిపోయిన పెళ్లి భోజనం పంచారు.
వివాహ వేడుకలో మిగిలిపోయిన ఆహారాన్ని స్థానికులు తినడంతో వారికి వాంతులు, విరోచనాలు, జ్వరాలతో బాధపడుతున్నారు. దీంతో వైఎస్ఆర్ నగర్‌కు చెందినవారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో చాలా మంది పరిస్థితి నిలకడగా ఉండగా, ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
సమాచారం అందిన వెంటనే.. మున్సిపల్ కమిషనర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పరిస్థితిని అంచనా వేయడానికి ఆసుపత్రిని సందర్శించారు. రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.