భారతదేశం, సెప్టెంబర్ 21 -- నాటక సమాజాలు, కళాకారులు, రచయితలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రతిష్టాత్మక నంది నాటకోత్సవాలు-2025తో పాటు కందుకూరి పురస్కారాలు-2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) నిర్వహణ కమిటీ ప్రకటన విడుదల చేసింది.

నంది నాటకోత్సవాలు-2025 కోసం పోటీ పడేందుకు నాటక సమాజాలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, వ్యక్తుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల నాటకాలు (చైల్డ్ ఆర్టిస్ట్స్/చిల్డ్రన్ ప్లేస్), కాలేజీ/యూనివర్సిటీ నాటకాలు, నాటకరంగం, ప్రదర్శన కళలపై రాసిన గ్రంథాలు/పుస్తకాల కోసం సేవలు అందించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

కందుకూరి పురస్కారాలు - 2026 నాటకరంగానికి విశే...