భారతదేశం, మార్చి 23 -- రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తీసిన 'ధురంధర్ ద రివెంజ్' సినిమా గురించి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌ను అభిమానులు అణువణువూ పరిశీలిస్తున్నారు. ఈ క్రేజ్ మధ్యలో ఇప్పుడు ఒక ఫ్యాన్ ఏఐ వాడి క్రియేట్ చేసిన సరికొత్త క్లైమ్యాక్స్ వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. డైరెక్టర్ ఇచ్చిన ఒరిజినల్ ముగింపు కంటే ఈ ఏఐ వీడియోనే ఎమోషనల్‌గా చాలా బాగుందని, కథకు కరెక్ట్ ముగింపు ఇచ్చిందని చాలామంది ఫీల్ అవుతున్నారు. అయితే ఇది చదివే ముందు కథకు సంబంధించిన స్పాయిలర్స్ ఉన్నాయని గమనించండి.

ధురంధర్ 2 సినిమా చివరిలో రణ్‌వీర్ చేసిన జస్కిరత్ (హమ్జా) క్యారెక్టర్ గూఢచర్యం, హింసతో నిండిన తన పాత జీవితాన్ని వదిలేసి దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత తన సొంత ఊరు పఠాన్‌కోట్ చేరుకుంటాడు. అయితే ఇన్నేళ్ల తర్వాత తన ఫ...